ఆందోల్: ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీకి టాస్క్ ఫోర్స్ బృందాలు
ఆందోల్ జోగిపేట్ నియోజకవర్గం (విజయభారతి) జూన్ 01 జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు, జిల్లాలోని 28 మండలాల్లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ అధికారులతో కలసి టాస్కో ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు, జిల్లాలో విత్తనాల కొరత లేదని పేర్కొన్నారు, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.