కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా.
ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ నియోజకవర్గం. (విజయ భారతి) జూన్ 15 ఎ ఎన్డీఎల్, 1: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వినతి పత్రం సమర్పిస్తున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా, జోగిపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయమంటూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరినట్టు జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైల్వే సాధన సమితి కన్వీనర్ గంగా జోగినాథ్ గుప్తా తెలిపారు, ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని కార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమన్పించానన్నారు గత 8 ఏళ్లుగా జోగిపేట, పరిసర ప్రాంతాల ప్రజలకు హాస్టల్ సేవలు అందిస్తున్న భవనం ప్రస్తుతం శిథిలాల వ్యవస్థకు చేరిందన్నారు, ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణం, కోసం నిధులు విడుదల చేయించమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు, కాగా తన వినతి పట్ల సానుకూలంగా స్పందించి కిషన్ రెడ్డి, సంబంధిత కేంద్ర మంత్రికి సిఫారసులను చేస్తానని హామీ ఇచ్చారు.