27 నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు
విజయ భారతి కుత్బుల్లాపూర్ : పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక
బస్సులను ఏర్పాటు చేసిందని జీడిమెట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క రోజులో జోగు లాంబ అమ్మవారి ఆలయం, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయం, పురాతన శివాలయాలు, మంత్రాలయం రాఘవేంద్రస్వామి, వేంక టేశ్వరస్వామి ఆలయాలు దర్శించుకునేలా రూట్మ్యాప్ సిద్ధం చేసిట్లు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం అవుతాయన్నారు. దుండిగల్ నుంచి గండిమైసమ్మ, షాపూర్ నగర్, చింతల్, జగద్గిరిగుట్ట, బాలానగర్, జేబీఎస్ మీదుగా బస్సు సర్వీ సులు కొనసాగనున్నాయి. ఉదయం 5 గంటలు బస్సు ప్రారంభమవుతుందని, తిరిగి రాత్రి 11 గంటలకు దుండిగల్ చేరుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. బుకింగ్, మరిన్ని వివరాలకు 9959226150, 9959615886 నంబర్లను సంప్రదించాలన్నారు.