జోగిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆందోల్ జోగిపేట్ మున్సిపల్ నియోజకవర్గం (విజయ భారతి) జూన్ 19; గురువారం జోగిపేట పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 55వ జన్మదినం పురస్కరించుకొని రాహుల్ గాంధీ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ దేశంలోని అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా ఉండాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవాలి, యువకులు రాజకీయాల్లో క్రియాశీలకముగా వ్యవహరించాలి నవభారత నిర్మాణానికి పునాదులు వేయాలి అని భారత్ లో యువశక్తి చాలా కీలకం యువత అన్ని రంగాల్లో ముందడుగు వేస్తే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా పిలుస్తుందని అన్నారు, భారత్ జూడో యాత్ర సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ దేశంలోనీ అన్ని ప్రాంతాలలో పర్యటించి అన్ని వర్గాల వారి సమస్యలు తెలుసుకున్నారు భవిష్యత్తులో తప్పకుండా రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని అవుతారు అని జోస్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, శివరాజ్, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల, ప్రవీణ్, రంగ సురేష్, కోరబోయిన నాగరాజ్ (నాని), గొల్ల శరత్ బాబు, పిట్ల లక్ష్మణ్, దుర్గేష్, చందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, చిట్యాల మధు, యాదయ్య, ఖలేద్, కాంగ్రెస్ నాయకులు కోశికె రాజశేఖర్, చింతకుంట శివ, ఆకుల నందు, బేకరీ అనిల్, గోహేర్, అబ్బాస్ ఆలీ,చోటు,పాల్గొన్నారు.