మురళి కృష్ణంరాజును పరామర్శించిన గిరిబాబు..
ప్రత్తిపాడు వైసిపి నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజును ధర్మవరం నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. మురళి కృష్ణంరాజు తండ్రి ముదునూరి రామరాజు పై పెట్టిన కేసు పై ఉన్నత అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 86 ఏళ్ల పెద్ద వ్యక్తిపై ఒక మహిళ పెట్టిన కేసును పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. మహిళలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ 86 ఏళ్ల మురళీ కృష్ణంరాజు తండ్రి రామరాజు పై కేసు నమోదు చేయడం దురదృష్టకరమని ఇటువంటి ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి చట్టాన్ని కాపాడాలన్నారు. మహిళలకు సమాజంలో స్వేచ్ఛగా జీవించి మహిళా ఉద్యోగుల విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలని అన్నారు.