Breaking News

జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి బ్యానర్లు పోస్టర్లను గోడలపై అంటించరాద అంటించరాదు: మున్సిపల్ కమిషనర్ అమ్రపాలి

జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి బ్యానర్లు పోస్టర్లు అంటించరాదు: మున్సిపల్ కమిషనర్ అమ్రపాలి

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ ;
గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించరాదని ఈ మేరకు జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం రోజు సాయంత్రం సర్క్యూలర్ జారీ చేశారు. వాల్ పోస్టర్లతో పాటు వాల్ పెయింటింగ్స్‌పై కూడా సీరియస్‌గా వ్యవహరించాలని. ఈ క్రమంలోనే సినిమా థియేటర్ వాళ్లు కూడా ఎక్కడా గోడలకు పోస్టర్లు అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.
గోడలపై పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సీరియస్‌గా అమలు చేయాలని అధికారులకు ఆమ్రపాలి సూచించారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *