హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకొని దూసుకుపోతున్న హైడ్రా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే మొదట సంపన్నుల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్నట్టు హైడ్రాకు విపరీతమైన మైలేజ్ వచ్చింది.
హైడ్రాపై మొదలైన వ్యతిరేఖత మొదట్లో
నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ప్రజల్లోకి ఈ విషయం చాలావరకు వెళ్ళింది. అప్పుడు హైడ్రా కూల్చివేతలపైన సర్వత్ర హర్షం వ్యక్తం అయింది. అయితే ఆ తరువాత పరిణామాలలో హైడ్రా సామాన్య మధ్యతరగతి ప్రజల నివాసాలను కూడా కూల్చివేస్తుండడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా పైన వ్యతిరేకత మొదలైంది. పేద మధ్యతరతి వర్గాల వారు హైడ్రా కూల్చివేతలతో కన్నీరు మున్నీరు అయ్యారు. అనేక వీడియోలు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారి హల్చల్ చేస్తున్నాయి.
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు విచారణ
ముఖ్యంగా ఆపరేషన్ మూసి చేపట్టి మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న ఆక్రమణలను కూల్చివేయాలని నిర్ణయించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరింత వ్యతిరేకత పెరిగి హైడ్రా వ్యవస్థ పైన ప్రతిపక్ష పార్టీలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఒక పిటిషన్ దాఖలు చేయగా దానిపైన హైకోర్టు ధర్మాసనం విచారించింది.