శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బాపూనగర్ ఈ హర్క మసీద్ దగ్గర, గుల్మోహన్ పార్క్ ఎదురుగా బాపూనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్వి షరీఫ్ ముభారక్ ఉత్సవాల్లో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ. గ్యార్వి షరీఫ్ పండుగను ముస్లింలు హిందువులు మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకుంటారని అన్నారు. ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వి షరీఫ్ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఐక్యమత్యంగా శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. భారతదేశంలో అన్ని కులాలకు అన్ని మతాలకు చోటు ఉందని అందరం కలిసి ఐకమత్యంగా అన్ని పండుగలను సంతోషాలతో వేడుక జరుపుకుందామని అన్నారు. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదని ఎవరి నమ్మకం వారిదని అందరి దేవుళ్ళను గౌరవించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గార్వి షరీఫ్ ఉత్సవం కార్యక్రమ నిర్వాహకులు షేక్ ఆసిఫ్, షేక్ మొయినుద్దీన్, ఎండి ముఖరం, ఎండి ఇర్ఫామ్, సయ్యద్ ఖదీర్, మహమ్మద్ అస్లం, ఎండి హా డు, మరియు బాపు నగర్ కాలనీ పెద్దలు యువకులు మహిళా సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


