కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;
బోరబండ అల్లాపూర్ లో మంగళవారం రోజు రాత్రి జరిగిన గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం మత సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ. ప్రతి వ్యక్తి ఎవరి మత ఆచారాలను వారు పాటిస్తూనే పరమత సహనాన్ని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు నాయకులు శేరి సతీష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్, జమీర్, కరీం ,అబ్దుల్లా, మస్తాన్ రెడ్డి, గౌస్, నజీర్, జహంగీర్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,సుంకన్న, ఫణీంద్ర కుమార్, శివ చౌదరి మరియు ముస్లిం యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


