Breaking News

ఘనంగా కామ్రేడ్ ముద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు

కామ్రేడ్ ఓంకార్ గారికి జోహార్లు


భూమి కోసం భుక్తి కోసం
వెట్టి చాకిరి విముక్తి కోసం
నిజాం దొరలపై గురిపెట్టిన
తుపాకీ తూటా ఆయన

ఆయన పేరు వింటే
నిస్వార్ధత గుర్తుకు వస్తుంది
నిరాడంబరత్వం
వుట్టి పడుతుంది

ఆయన రాజకీయాలకు
విలువలు అద్దిన
దురంధరుడు
అపర మేధావి

ఆయన పేదల పక్షపాతి
అయినను చట్టసభలు
ఇష్టపడతాయి
ఆయన మాటలు వింటాయి కూడా

సమస్యలపై ధారాళంగా
గళమెత్తితే ఆయనను
అసెంబ్లీ”లే” టైగర్ అని
పిలిచింది

ఆయన గురించి వింటే
మరణాన్ని ముద్దాడిన
మృత్యుంజయుడు
గుర్తుకొస్తాడు

కత్తి పోట్లు,నాటు బాంబులు
తుపాకీ తూటాలు
ఆయనకు
వంగి సలాం చేస్తాయి

పేదలకు పెద్దన్న
శ్రామికుల శ్రమజీవి
ఆయన బహుజనుల స్వప్నం
పోరాటాల పొద్దు పొడుపు

పల్లెలన్నీ ఓంకార్ సాబ్ గా
పిల్చుకుంటాయి
అన్ని తరగతుల వారికి
ఆయన ఆత్మీయ బంధువు

మురళి కృష్ణంరాజును పరామర్శించిన గిరిబాబు..

ఆయన నేటి తరానికి
రేపటి తరానికి కూడా
ఆదర్శప్రాయుడు
స్వార్థమేరుగని యోధుడు

మార్క్సిస్టు సిద్ధాంతంతో
కమ్యూనిస్టు ఆశయంతో
బహుజన ఆలోచనతో
అయిన ఓంకార్ అయ్యాడు

వామపక్షాల ఐక్యత
సామాజిక శక్తుల సమీకరణ నే
కర్తవ్యంగా భావించిన ఆయన
ప్రజా ఉద్యమాల బాటసారి

ఆర్థిక,రాజకీయ,సామాజిక
సమానత్వ
సాధనకు,సాధికారతకు
ఆయన నినాదాల గొంతుక

కుల-మత ప్రాంతీయతత్వ
దోపిడి,అసమానతలు లేని
నవ సమాజ నిర్మాణ
ఉద్యమాలకు ఊపిరి ఆయన

అగ్రవర్ణాల ఆధిపత్య
పెట్టుబడి దారికి,దోపిడీకి
వ్యతిరేక పోరాటాలకు
ఆయన మార్గదర్శకులు

బహుజన బంధువు
శ్రామిక వర్గాల ఆశాజ్యోతి
సమస్త ప్రజల సమానత్వ
నినాదం ఆయన

ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు
మాజీ శాసనసభ్యులు అమరజీవి
కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారికి
సామాజిక విప్లవ జోహార్లు
ఆయనకు
ఘన నివాళులు…

                      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *