శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల సురభి కాలనీలో స్థానిక పేద ప్రజల పిల్లలు చదువుకు దూరం కావద్దనే సంకల్పంతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఛైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తమ సొంత ఖర్చులతో ఎంపిపిఎస్ పాఠశాలను నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత పేద ప్రజల పిల్లలు బాల బాలికలు విద్యను అభ్యాసించాలని 2016 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2016 సంవత్సరములో 8 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల ప్రస్తుతం సుమారుగా 450పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యాసిస్తున్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చొరవతో తన సొంత ఖర్చులతో ఉపాధ్యాయులకు నెలసరి వేతనాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తరుఫున ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు మెరుగైన విద్య అందించలేకపోతున్నాము అనే ఆలోచనతో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరకు గత కొన్ని ఏళ్ళుగా ప్రయత్నించడం జరిగింది. ఇటీవలే విద్యా కమిషన్ చైర్మన్ ఆకుల మురళి ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలసి ఉపాధ్యాయులను నియమించుట కొరకై వినతి పత్రం అందచేయగా ఆయన సానుకూలంగా స్పందించి పై అధికారులకు వివరించగ 24గంటల్లో ప్రభుత్వం తరుఫున ఆరుగురు ఉపాధ్యాయులను నియమించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సీఎం రేవంత్ రెడ్డి కి, విద్యా కమిషన్ ఛైర్పర్సన్ ఆకుల మురళి కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్పొరేటర్ సంతోషం వ్యక్తం చేస్తు పేద కుటుంబాలకు చెందిన బాల బాలికల చదువు కొరకు నా వంతు కృషి ఎల్లపుడు ఉంటుందని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఎంపీపీఎస్ పాఠశాల ఉంటుందని విద్యార్థులు మంచి మార్కులతో పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులు చదువుతున్నారని అన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు జిల్లా పరిషత్ పాఠశాలలో కలిసినప్పుడు ఆంగ్ల భాషలో ప్రావీణ్యత కనపరుస్తూ మాట్లాడడం గర్వంగా ఉందని అన్నారు. విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, ఇంజనీర్ అవ్వాలని ఆకాంక్షించారు. హెచ్ ఎం గంగాధర్ మాట్లాడుతూ. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పెద్ద మనసుతో ఈ ప్రాంత పేద ప్రజల పిల్లలు చదువులకు దూరం కావద్దని తమ సొంత ఖర్చులతో సుమారుగా 50 లక్షల రూపాయలతో పాఠశాలను అందుబాటులోకి తెచ్చినందుకు గర్వపడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యాబోధనలు విద్యార్థులు అభ్యసిస్తున్నారని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎల్లప్పుడూ ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. నూతనంగా విచ్చేసిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ. తమ శక్తివంచన లేకుండా విద్యార్థిని విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుటకై ఉన్నతమైన విద్యాబుద్ధులను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం గంగాధర్ రావు, స్కూల్ మానేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ బస్వరాజ్, వైస్ ఛైర్మెన్ సుమలత, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, ఆశ్రఫ్, నూతన ఉపాధ్యాయులు పాండురంగ రావు, మౌనిక, మాధవి, విజయ, పూజిత, వనిత, స్థానిక వాసులు సారయ్య గౌడ్, యోగి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
