విడాకులు తీసుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
శేరిలింగంపల్లి మాదాపూర్ విజయ భారతి న్యూస్ ; భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న భర్త ప్రవర్తన మారలేదని వివాహిత సరెడ్డి శ్వేత మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనకు తన కుటుంబ సభ్యులకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి చెడు సందేశాలు, నగ్న ఫొటోలు పంపిస్తున్నాడని సరెడ్డి శ్వేత ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ కు చెందిన బాధితురాలు సరెడ్డి శ్వేత మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంది. తన భర్త వేపల సింగారం గ్రామం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లాకు చెందిన బెత్తం తిరుమల్ రెడ్డి కూడా మాదాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె ఫిబ్రవరి 23 2024 లో విడాకులు తీసుకుంది. అయితే ఇటీవల ఆమెకు తెలియని నెంబర్ల నుంచి తన మాజీ భర్త బేతం తిరుమలరెడ్డి చెడు సందేశాలు, నగ్న ఫొటోలు పంపిస్తున్నాడని. ఈ ఫొటోలు సోషల్ మీడి యాలో పోస్టు చేస్తానని ఆమెను బెదిరిస్తున్నాడని దాంతో విసుగు చెందిన బాధితురాలు తన మాజీ భర్త బేతం తిరుమల్ రెడ్డి పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బేతం తిరుమలరెడ్డిపై సెక్షన్ 66(ఇ) 67(ఎ) ఐటీ యాక్ట్ కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
