రంగారెడ్డి జిల్లా విజయభారతి న్యూస్ ;
రంగారెడ్డి జిల్లా సీనియర్ జర్నలిస్ట్ రాములు గౌడ్ మృతి పట్ల మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రజా టైమ్స్ ఎడిటర్ గా రంగారెడ్డి జిల్లాలో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు.రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమన్నారు. రాములు గౌడ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
