టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి
ఇష్టారాజ్యంగా అక్రమ అంతస్తుల నిర్మాణాలు
చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
మామూళ్ల కు పరిమితమైన చైన్ మెన్ లక్ష్మీ నారాయణ
-సమస్యలను పట్టించుకోవడం లో ఉన్నతాధికారులు విఫలం
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; అవినీతి పై ఉక్కుపాదం మోపుతామన్న పై స్థాయి ఆదేశాలను కొందరు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. అందుకు నిదర్శనం శేరిలింగంపల్లి సర్కిల్ లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల భాగోతమే. ముఖ్యంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనిలో ఆకాశమే హద్దుగా అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయీ. కొన్ని చోట్ల 150 నుండి 200 గజాల లోపు నాలుగు ఐదు అంతస్తుల భవనాలు నిర్వహిస్తున్నారు. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎవరు పడితే వారు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తూన్న వారి నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు పట్టణ ప్రణాళిక విభాగం పై గుప్పు మంటున్నాయి. దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కాస్త టౌన్ ప్లానింగ్ అధికారుల జేబుల్లోకి వెళుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలో రాఘవేంద్ర కలనిలో అనుమతులకు విరుద్దంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. అలాగే గ్రౌండ్ ప్లస్ 2 పర్మిషన్ తీసుకుని అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అధికారులు ఏం చేస్తున్నారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం శేరిలింగంపల్లి సర్కిల్ లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టిన తిరిగి మళ్ళీ కిందిస్థాయి అధికారుల ప్రోద్బలంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు వెనక టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్, చైన్ మెన్ లు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు దగ్గరుండి మరీ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతోనే అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయని ఎన్నో ఆరోపణలున్నాయి. ఎలాంటి అక్రమ నిర్మాణాలైన ప్రోత్సహించకుండ కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తరచు చెపుతూ వుంటారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు వీరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణ దారులు ఇష్టాను సారంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తునే ఉన్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి : – నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి డి డి ల రుపెన డబ్బులు చెలించాల్సి ఉంటుంది కానీ వాటిని తుంగలో తొక్కినట్లు వ్యవహరిస్తూ డి డిలు చెలించకుండా అడ్డ దారిలో అక్రమంగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమ నిర్మాణాలను నిరోధించాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు మామూళ్లు పుచ్చుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్యహిస్తున్నారన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు అంటేనే అధికారులకు బంగారు గుడ్లు పెట్టె బాతుల్లా తయారయ్యాయి.
చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు : – అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి సెట్ బ్యాకులు లేకుండా అక్రమ నిర్మాణాలు బహుళ అంతస్తులు నిర్మిస్తున్న చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా జి హెచ్ యం సి అధికారులు బిల్డర్లతో చేతులు కలిపి వారితో వ్యాపారం చేస్తున్నారని స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి అక్రమ కట్టడాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోని వాటిని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా అవినీతి మయమైన టౌన్ ప్లానింగ్ పట్టణ ప్రణాళిక విభాగంలో చైన్ మెన్ నుండి పై స్థాయి అధికారి వరకు జీహెచ్ఎంసీలో మామూళ్లకు అలవాటు పడడం వల్లనే ప్రతి వీధిలో అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి అన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెల అధికారులకు జీతాల కంటే అక్రమ నిర్మాణాలపై వస్తున్న మామూళ్లే లక్షలు దాటి కోట్లలో వెనకస్తున్నారనే విమర్శలు సర్కిల్ చుట్టు చక్కర్లు కొడుతున్నాయి.ఈ లెక్కన అధికారుల అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్,జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు మౌనం వహించడంతో కిందిస్థాయి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా అవినీతి రాజ్యమేలుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఫలితం ఉండదని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు అక్రమ నిర్మాణాల పైన టౌన్ ప్లానింగ్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పిన ఎలాంటి చర్యలు తీసుకోని దుస్థితి నెలకొందని ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉందని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఉప కమిషనర్ లు స్పందించి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన శేరిలింగంపల్లి సర్కిల్ నీ.. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై అందుకు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే జిహెచ్ఎంసి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

