Breaking News

నిండు ప్రాణాన్ని బలికొన్న భవనం

జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్యం వల్లే ఘటన

టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో నిర్మాణాలు

ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా భవన నిర్మాణలు

శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ; నిన్న మొన్నటి వరకు అందరూ టౌన్ ప్లానింగ్ చైన్మెన్ లే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని, ఎక్కడ చూసినా చర్చలు ఆరోపణలు జరిగాయి ఇటీవలే జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు ప్రక్షాళన చేశారు. ఎవరిపైన విపరీతమైన ఆరోపణలు ఉన్నాయో వారికి స్థాన చలనం కల్పించారు. (బదిలీలు) విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పాల్పడిన టౌన్ ప్లానింగ్ అధికారులను ఈ మధ్యకాలంలోనే బదిలీ చేశారు. వారితోపాటు చైన్ మెన్ సైతం వివిధ ప్రాంతాల సర్కిళ్లకు బదిలీ చేశారు. కానీ వారు మారిన తర్వాత కూడా విచ్చలవిడిగా అక్రమ బహుళ అంతస్తులు నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్నాయి.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

కార్మికుని నిండు ప్రాణం బలి : – మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. 200 గజాలలో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం జి ప్లస్ టు (G+2) అనుమతితో జి ప్లస్ నాలుగు (G+4) అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రోజు వారి దినసరి కూలీ వేతనంగా జనగాం జిల్లా, తరిగోపుల మండలం, అక్షాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి యాదగిరి (44) అనే వ్యక్తి హైదరాబాద్ కు వచ్చి పొట్టకూటికోసం గత పది సంవత్సరాలుగా జగద్గిరిగుట్ట లో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ క్రమంలో రోజువారీగా కూలీ పనుల కోసం మియాపూర్, మయూరి నగర్ ఎం ఐ జి లో 465 ప్లాట్ లో పని నిమిత్తం వచ్చారు. ఈ క్రమంలో మంకీ లిఫ్ట్ పనులు చేస్తుండగా కరెంటు షాక్ తగలడంతో మూడో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆయనకి భార్య రజిత ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.

భద్రతా చర్యలు ఎక్కడ…

ఇంటి యజమాని వెంకటేశ్వర్లు అనే బిల్డర్ ఈ భవన నిర్మాణం 200 గాజాలలో G+2 అనుమతితో G+4 నిర్మాణం చేస్తూ, ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా , పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ బెల్ట్ లేకుండా, అనుమతలకు మించి కట్టడంతో పాటు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా, నిర్మాణం చేస్తున్నారు. దీనిపై జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఎటువంటి జవాబు లేకపోవడం గమనార్హం. నియమనిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వకూడదని, అలా ఎలా ఇస్తారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ఒక నిండు ప్రాణం బలి కావడం జరిగినది. మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన తీరును పరిశీలించారు. చనిపోయిన కార్మికుని భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. కేసును మియపూర్ పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *