శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ : చదువుతో పాటు, అన్ని రంగాలలో అందరికీ ఆదర్శంగా బి. హెచ్. ఈ. ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ నిలుస్తుందని కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్ అన్నారు. వారిలో చూపు మాత్రమే లేకపోవచ్చు కానీ నైపుణ్యం, ముందు చూపు మెండుగా ఉన్నాయని అభినందించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అంధులకు కొండంత సహాయం చేయాలని సంకల్పించి “ఇట్రాడ్ సోచ్ ఫౌండేషన్” వారు చేపట్టిన ఓల్దేజ్ హోమ్ ఫర్ బ్లైండ్ ప్రాజెక్ట్ కోసం జ్యోతి విద్యాలయ హైస్కూల్ యాజమాన్యం గత పదేళ్లుగా తమకు అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని, సంస్థ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పెద్ద ఎత్తున సహాయం చేయడానికి ముందుకు వచ్చి, తమ స్కూల్ యొక్క విద్యార్థి విద్యార్థులకు సమాజం మరియు సేవా దృక్పధం గురించి వివరించి, సహాయ నిమిత్తం అందరు పాల్గొని, సహకరించాలని సోచ్ ఫౌండేషన్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. అంధులు శనివారం రోజు విద్యాలయ ఆవరణలో ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ రకాల పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో సోచ్ సంస్థ నిర్వాహకులు, గౌరవ డైరెక్టర్. ఏ. వి. ప్రశాంత్ విద్యార్థులు, టీచర్లు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇట్రాడ్ సోచ్ ఫౌండేషన్ ఫౌండర్ .మధుకర్ రెడ్డి జ్యోతి విద్యాలయ హైస్కూల్ కరెస్పాండంట్, ఫాదర్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
