విజయ భారతి న్యూస్ ; ఇష్టం లేని పెళ్లి చేశారని హైదరాబాద్ లోని సుచిత్ర ఏరియాలో దుర్గా శ్రీదేవి అనే (25) నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలు మేడపైకి వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో భర్త చూస్తుండగానే దుర్గా శ్రీదేవి, అపార్టుమెంట్ 5వ అంతస్తు పై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. శ్రీదేవికి తాడేపల్లిగూడెంకు చెందిన వంశీకృష్ణతో అక్టోబర్ 16న వివాహమైంది.
