శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ : రజక సంఘం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.
శ్రీ పెద్దమ్మ తల్లి 825 సంఘం రాష్ట్ర కమింటి మొదటి సమావేశం శేరిలింగంపల్లి నియోజకవర్గం హాఫిజ్ పేట్ డివిజన్ లోని ఇంద్రరెడ్డి ఆత్వన్ కాలనీ లో రాష్ట్ర కమిటి అధ్యక్షురాలు లక్ష్మి మరియు రాష్ట్ర కమిటి సభ్యుల సమక్షoలో .నిర్వహించారు. రజకుల సమస్యలను వివరిస్తు లక్ష్మి మాట్లాడుతూ రజకుల కు చెరువులు దోబీఘాటులు మరియు భోర్టు వేసి బట్టలు ఉతకడానికి ప్రభుత్వం కృషి చేయాలనీ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. రజకులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇబ్బలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫై అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రసాద్, మరియు జాయింట్ సెక్రెటరీ విఘ్నేష్, రజక సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు, కోశాధికారి వీరబాబు మరియు కార్యవర్గసభ్యులు దుర్గ, శివనారాయణ, సత్య నారాయణ, క్రిష్ణ మరియు కమిటి సబ్బులు తదితరులు పాల్గొన్నారు.
