ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి మూటగట్టిన ప్రియుడు
భద్రాద్రి జిల్లా విజయభారతి న్యూస్ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాచినేని తండాలో స్వాతి అనే 32ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు 20 ముక్కలుగా నరికి చంపి మూటగట్టి పొలంలో పడేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని పార్వతి, రత్న కుమార్ దంపతుల వద్ద వీరభద్రం, స్వాతి కలిసి రూ.16 లక్షలు తీసుకున్నారు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో రత్నకుమార్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ డబ్బుల విషయంపై స్వాతి నిలదీయడంతో వీరభద్రం ఆమెను 20 ముక్కలుగా నరికి చంపేశాడు.
