హైదరాబాద్ విజయభారతి న్యూస్ ; ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. శనివారం రోజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో శనివారం రోజు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుటాహుటిన మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు.
