శేరిలింగంపల్లి గచ్చిబౌలి విజయభారతి న్యూస్ ; బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ , భేరి శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి నేతృత్వంలో వారి స్వగృహంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో యాదగిరి గురుస్వామి, శ్రీశైలం కన్నె స్వామి, విక్రమ్ కత్తి స్వామి, సంతోష్ పేరు స్వామి, శివ శంకర్ గద స్వామి, సాయి కత్తి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ. అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజులు మండల పూజా భక్తిశ్రద్ధలతో పూజించి అయ్యప్పస్వామి శబరిమలకు కాలినడకన ఎంతో మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు అని అన్నారు. అయ్యప్ప స్వామి భక్తులందరి పైన ఆ స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్పని వేడుకున్నారు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఉండాలి అని అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు.ఈ కార్యక్రమంలో బేరి కుటుంబ సభ్యులు బేరిచంద్రశేఖర్ యాదవ్, భేరి వేదాన్ష్ యాదవ్,భేరి సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
