శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ; వాహనం ఢీకొని వృద్ధుడు మరణించిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 19 మంగళవారం రోజు రాత్రి మదీనాగూడ ప్రధాన రహదారిలోని జిఎస్ఎం మాల్ వద్ద రోడ్డు దాటుతున్న ఒక గుర్తు తెలియని మగ వ్యక్తిని వయస్సు(70) గుర్తు తెలియని వాహనంతో ఢీ కొట్టి పారిపోయారు తీవ్ర గాయాల పాలైన వృద్ధుడిని జిఎస్ఎం షాపింగ్ మాల్ సెక్యూరిటీ వారు అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్ కు చికిత్స కోసం తీసుకెళ్ళి అడ్మిట్ చేపించారు. తీవ్రగాయాల పాలైన వృద్ధుడు చికిత్స పొందుతు శుక్రవారం రోజు ఉదయం మృతి చెందాడు దీనిపై సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా మృతున్ని గుర్తు పట్టినచో మియాపూర్ పోలీసులను ఈ క్రింది మొబైల్ నంబర్లలో సంప్రదించాలని మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, సెక్టార్ ఎస్సై చంద్రయ్య తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9490617129, 8712568233, 8712663179
