Breaking News

రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములను వదలని అక్రమార్కులు

కోట్ల విలువగల ప్రభుత్వభూమి మాయం

మద్దతుగా నిలుస్తున్న రెవెన్యూ జిహెచ్ఎంసి అధికారులు

అధికారులను అనుకూలంగా మార్చుకొని అక్రమ నిర్మాణాల జోరు

ప్రైవేటు సర్వే నంబర్లు గా మారుతున్న ప్రభుత్వ సర్వే నంబర్లు

మనీ మేక్స్ మెనీ థింగ్స్

శేరిలింగంపల్లి మియాపూర్ విజయ భారతి న్యూస్ ; శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ శివారు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో గల సర్వే నంబర్ 69 లో మియాపూర్ ఆల్విన్ కాలనీ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 69 లో ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కాపాడేందుకు రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాల జోరు పెరిగింది.
కోట్లు రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రెవెన్యూ మరియు జిహెచ్ఎంసి అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. భవనాలు నిర్మించి ఎంచక్కా అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూములను కాపాడాల్సిన రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువచేసే 69 సర్వే నెంబరు లో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో చాలావరకు నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయినప్పటికీ ఇంకా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు ఈ సర్వే నెంబర్లో ఉంది. వీటిని రక్షించుకోవాల్సిన రెవెన్యూ మరియు జిహెచ్ఎంసి అధికారులు కేవలం నోటి మాటతో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను చేపట్టకూడదంటూ చెప్పేసి పనులు ఆపించేశామంటూ చెప్పుకోస్తున్నారు. కానీ తిరిగి నిర్మాణాలు యదావిధిగా కొనసాగుతున్న నేపద్యంలో అధికారులు చాలా ఉదాసీనతతో వ్యవహరించడంతోనే ఈ విధంగా జరుగుతుందని అధికారుల తీరును ప్రజలు దుయ్యబడుతున్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

ప్రభుత్వ భూమిలో ప్రైవేటు పాగా
69 సర్వే నెంబర్‌ భూమాపై గతం లో తెలంగాణ హై కోర్ట్ కూడా ప్రభుత్వాభూమిగా తీర్పు ఇచ్చినప్పటికి అక్రమార్కులు తగ్గేదెలే అంటూ వ్యవహరిస్తున్నారు. మరికొందరు దీనిపై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించడంతో ప్రస్తుస్థానికి యెటువంటి నిర్మాణాలు నిర్మించకూడదని ఆదేశాలున్నపట్టికి నిర్మాణాల జోరు తగ్గలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, కూడా నోరు మెదపకపోవడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంతో భాగస్వాములుగా నిలిచినట్లు సమాచారం. అందుకే వారెవరూ ఈ భూములను కాపాడేందుకు ముందుకు రావడం లేదంటున్నారు.

మద్దతుగా నిలుస్తున్న రెవెన్యూ జిహెచ్ఎంసి అధికారులు – అందరికీ ముడుపులు : – హైటెక్ సిటీకి కుతవేటు దూరంలో ఉండటంతో అత్యంత ఖరీదైన ఈ భూమిని కాపాడడంలో రెవెన్యూ, జిహెచ్ఎంసి యంత్రాంగం విఫలమైనట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని సూచించిన ప్రభుత్వ అధికారులు పెడచెవిన పెట్టారని, అందుకే ఆ భూమి అదృశ్యమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 69 సర్వే నెంబర్లలో పలు నిర్మాణాలు జరుగుతున్నా ఆ నిర్మాణాలపై పలువురు ఫిర్యాదు చేసిన అటు రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ హెచ్‌ఎం‌డి‌ఏ అధికారులతో సహ ఎవ్వరూ పట్టించుకోకపోవటం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మియాపూర్ ఆల్విన్ కాలనీ లో ఆర్‌ఐ పేరు వినిపించడం గమనార్హం. ఇక్కడ బుల్డింగ్ ల పై పలుమార్లు ఆర్‌ఐ కు కంప్లెంట్స్ వచ్చిన చూసి చూడనట్టు వ్యవహరించడం కూడా ఒక కారణంకావొచ్చు.

ప్రైవేటు సర్వే నంబర్లు గా మారుతున్న ప్రభుత్వ సర్వే నంబర్లు : – మియాపూర్ గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్ 69 ప్రభుత్వ భూమి కాస్త ప్రైవేట్ సర్వే నంబర్లు 222, 224 గా మారిపోతున్నాయి. ఇప్పటికే ఈ సర్వే నంబర్లతో మైత్రి నగర్ పేస్ 2 కాలనీ ఏర్పడింది. కానీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న సర్వేనెంబర్ 222, 224 పేరుతో ప్రభుత్వ భూమి అయినా సర్వే నంబరు 69లో అక్రమ నిర్మాణాలు జరగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గతంలో సర్వేనెంబర్ 69 ప్రభుత్వ భూమి కాస్త ప్రైవేట్ భూమిగా ఎలా మారిందో రెవెన్యూ అధికారులకు తెలియాలి.

మనీ మిక్స్ మెనీ థింగ్స్ : – మనీ మేక్స్‌ మెనీ థింగ్స్‌.. అనేది అక్షరాలా నిజం డబ్బు ఏదైనా చేస్తుంది. ఎంతటి అరాచికాన్నైనా ఈజీగా చేసేస్తుంది.. నీతి ఉండదు.. నిజాయితీ ఉండదు.. నిబంధనలుండవు.. అందరినీ ఆవహిస్తుంది.. బాధ్యతలు మరచిపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం శేరిలింగంపల్లి రెవెన్యూ, చందానగర్ సర్కిల్ 21 లో ఇదే జరుగుతోంది.. ఎక్కడచూసినా అక్రమ నిర్మాణాలు, అవినీతి రాజ్యం ఏలుతోంది.. ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో జోగుతూ తమ విధులను మరచిపోతుండటంతో ఆగడాలు ఆగడం లేదు.. రెవెన్యూ, జీ.హెచ్‌.ఎం.సి. చందానగర్ సర్కిల్‌ లో యథేచ్ఛగా జరుగుతున్న బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం వ్యవహారంలో ఇలాంటి జోక్యం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

ఆధారాలతో నిరూపిస్తాం…
శేరిలింగపల్లి రెవెన్యూ, సర్కిల్‌ 21, జీ.హెచ్‌.ఎం.సీ పరిధిలో చెలరేగుతున్న అక్రమ నిర్మాణదారులు..
ప్రేక్షక పాత్రలో రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు..
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు..
యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు.. ప్రజా శ్రేయస్సు దృశ్య పూర్తి ఆధారాలతో విజయభారతి దినపత్రిక లో మరో కథనం పాఠకులకు బహిర్గతం చేస్తాం.

oplus_131072

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *