విజయ భారతి న్యూస్ ;
2సార్లు ఒలింపిక్ పతకాన్ని గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయపురలో పెళ్లి చేసుకోనున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో సింధు వివాహం జరగనుంది. వెడ్డింగ్ రిసెప్షన్ డిసెంబర్ 24న హైదరాబాద్ లో జరగనుంది. వధూవరుల ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలా కాలంగా తెలుసని సింధు తండ్రి పీవీ రమణ అన్నారు.

