బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేసింది కేసీఆరే

వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేసింది కేసీఆరే

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా వికలాంగులకే చేసిందేమీ లేదు

మనోధైర్యంతో ప్రపంచాన్ని జయించే సత్తా ఉంది

ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తున్నారు

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారితో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

శేరిలింగంపల్లి వికలాంగులకు నూతన వస్త్రాలు అందజేత

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

రవీందర్ యాదవ్ పేదల కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు -ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ ఉంటేనే వికలాంగులకు భరోసా – రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; వికలాంగులకు అండగా నిలిచి ఆదుకుంది భారాస అధినేత కేసీఆర్ మాత్రమేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అధికారంలోకి రాగానే రూ. 3000 పింఛన్ ను ఇవ్వడంతో పాటు దాన్ని పెంచిన ఘనత కూడా కేసీఆర్ దేనని వెల్లడించారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి వికలాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారికి నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. సామాన్యుల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం రవీందర్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. వికలాంగులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని చేసి చూపించింది కేవలం కేసీఆర్ మాత్రమేనన్నారు. వికలాంగులు అన్నింట్లోనూ రాణించాలన్నారు. మనోధైర్యంతో ప్రపంచాన్ని జయించే శక్తి వికలాంగులకు ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సాధించిన ఘనతలు ఉన్నాయని గుర్తు చేశారు. భారాస పేదల పక్షాన నిలవడమే కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తో పాటు శేరిలింగంపల్లి నుంచి తరలి వచ్చిన నేతలు, పలువురు వికలాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. వికలాంగులు అన్నింట్లో రాణించాలని, మనోధైర్యంతో ప్రపంచాన్ని జయించే సత్తా ఉందని చెప్పారు. భారాస అధికారంలోకి రాగానే వికలాంగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలతో కేసీఆర్ అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.