బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

హైదరాబాద్ విజయ భారతి న్యూస్ : డిసెంబర్ 06
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్‌బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం రోజు ప్రకటించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరగడం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మరోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తు న్నట్లు వెల్లడించారు. 2023, ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు రెపో రేటును మార్పులు చేయకుండా యథాతథంగానే కొనసాగి స్తూ వస్తోంది. వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవడం వరుసగా 11వ సారి కావడం గమనార్హం. డిసెంబర్ 4, 2024 నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ మానీటరీ పాలసీ సమీక్షా సమావేశం జరి గింది. ఇందులో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిం చేందుకు 4:2 రేషియోలో మద్దతు లభించినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి స్థిర విధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…