Breaking News

మెరుగైన వైద్యం అందాలి..

మెరుగైన వైద్య సేవలు అందజేయాలిబిజెపి మండల శాఖ అధ్యక్షులు అనుమల సంపత్ రెడ్డిగజ్వేల్ నియోజకవర్గం, 09 డిసెంబర్ 2024 : సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో రోజురోజుకు వైద్య సేవలు దిగజారిపోతున్నాయని డిఏంహెచ్ఓ పల్వన్ కుమార్ ని బీజేపీ కుకునూరుపల్లి మండల శాఖ అధ్యక్షులు అనుమల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బిజెపి కుకునూరుపల్లి మండల శాఖ అధ్యక్షులు అనుమల సంపత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జాతీయ స్థాయిలో అవార్డు అందుకొని జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన కుకునూరుపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రస్తుతం వైద్య సేవలు దిగజారిపోయిందని, ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యురాలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పేషెంట్లు తక్కువగా వచ్చిన ఎక్కువగా వస్తున్నట్లు తప్పుడుగా రిజిస్ట్రార్ నమోదు చేస్తూ 80 నుంచి 90 వరకు చూపిస్తున్నారని, డాక్టర్ సమయపాలన పాటించడం లేదని, డెలివరీ కేసులు ఆసుపత్రిలో చేయడం లేదని, సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ చీటికిమాటికి ఇబ్బంది పెడుతుందని, విషయాల పై ఎంక్వయిరీ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిఏంహెచ్ఓ పల్వన్ కుమార్ ని కోరడం జరిగిందన్నారు. అదే విధంగా కుకునూరుపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి అంబులెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సదానంద్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గుర్రాల స్వామి, మండల నాయకులు ప్రేమ్ కుమార్ రెడ్డి, కోకొండ రాజు చారి, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *