ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలుగజ్వేల్, 09 డిసెంబర్ 2024 : తెలంగాణ రాష్ట్ర వర ప్రదాయిని, తెలంగాణ తల్లి, రాజ్యసభ సభ్యురాలు మాజీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు గజ్వేల్ పట్టణ పరిధిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. తదనంతరం గజ్వేల్ పట్టణంలోని మానసిక వికలాంగుల హాస్టల్ లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీకాంత్ రావు మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమం లో ఎంతో మంది విద్యార్థులు అమరులు అవుతున్నారని గ్రహించి, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కి నష్టం వాటిల్లుతుందని, పార్టీ మనుగడ కొల్పుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహా నేత అని కొనియాడారు. అలాంటి మహా తల్లి జన్మదినం సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తామని ఘంటా పథంగా తెలియజేస్తున్నామన్నారు. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముఖ ద్వారం ఎదురుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం చాలా సంతోషకరం అని కొనియాడారు. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి కల్లబొల్లి మాటలతో, ముసలి కన్నీరు కారుస్తున్న ప్రతిపక్షాలు ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గోపాల్ రావు, గజ్వేల్ మండల అధ్యక్షుడు మద్దూరి మల్లారెడ్డి, పీసీసీ రాష్ట్ర మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఇక్బాల్, ములుగు మండల అధ్యక్షుడు గంగిశెట్టి శ్రీనివాస్ గుప్తా, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు, ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్, యువజన కాంగ్రెస్ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్షులు చెట్టిపల్లి అనిల్ రెడ్డి, మన్నే కృపానందం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుంట భూపాల్ రెడ్డి, నాయకం శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, ఫని, తుప్పతి భిక్షపతి, యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొత్తపేట కరుణాకర్ రెడ్డి, సయ్యద్ బాబా, బాలయ్య గారి రాజు గౌడ్, శ్రీనివాస్, సమీర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
