పఠాన్ చేరు విజయ భారతి న్యూస్ ; మంగళవారం రోజు బిఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు ట్రాబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా హరీష్ రావు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళగా ఆయనతోపాటు పటాన్ చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి లతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో హరీష్ రావు కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ. మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు, ట్రబుల్ షూటర్, డైనమిక్ లీడర్ హరీష్ రావు కి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని ఆయన ఈలాంటి పెళ్ళిరోజులు మరెన్నో శుభవార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన పోరాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలియజేశారు.


