గజ్వేల్ విజయభారతి న్యూస్ : త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి డీఎస్పీ మదనం గంగాధర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మదనం గంగాధర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ పూర్తి సహాయ సహకారాలు ఉండాలని, అత్యున్నత పదవి డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుందని, నిరుపేద కుటుంబం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని, మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ మొదటిసారి ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సభకు ఇంత భారీ ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ పట్టబదుల ఐక్యవేదిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి పట్టబద్రులంతా సంఘటితం అయ్యేవిధంగా సహకరిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
