గజ్వేల్, 10 డిసెంబర్ 2024 (విజన్ ఆంధ్ర) :
మూర్ఖత్వపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరాకాష్ట చర్యగా తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ హస్తం గుర్తు తల్లిని సెక్రటేరియట్ లో పెట్టిన సందర్భంగా అసలైన తెలంగాణ తల్లికి అన్యాయం జరిగిందని మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేసిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధపు అసత్యపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తలరాతను మారుస్తానని చెప్పి అసలైన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినారని రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలోని బాసులకు తాకట్టు పెడుతున్నారనరు. తెలంగాణ తల్లిని మార్చడం తెలంగాణ నేల అస్తిత్వం ఆత్మగౌరవం పై దాడి అని తెలిపారు. రాజసం ఉట్టిపడే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి ధనికంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా హస్తం గుర్తుతో ఏర్పాటుచేసిన దివాలా ప్రతిరూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ప్రతిష్టించడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం చేసి చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం అంటే బతుకమ్మకు ప్రతీకగా, తెలంగాణ రాష్ట్రం అంటే పాడి పంటలకు ప్రతీకగా, తెలంగాణ రాష్ట్రం అంటే రాణి రుద్రమదేవి పోరాటం గుర్తుకు వచ్చేలా, తెలంగాణ తల్లి రూపాన్ని కేసీఆర్ ఆ రోజు తెలంగాణ భవన్లో ప్రతిష్టించారని తెలిపారు. మార్పు తీసుకొస్తామని చెప్పి ఉత్తరప్రగాలు బాలు పలికి అబద్ధపు అసత్యపు ప్రచారాలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లుల మార్పు చేయడమేనా తీసుకువచ్చిన మార్పుని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలరాసేలా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్ పై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్యలతో ఉద్యమానికి అమరత్వానికి ప్రతిరూపమైన తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుందని తెలిపారు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని ఈ చర్య అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మూర్ఖత్వపు ఆలోచనలు మార్చుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ తల్లిని తీసివేసి అసలు అయినా తెలంగాణ తల్లిని సచివాలయంలో పునర్ ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీద, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు వివిధ మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పిఎసిఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
