ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
శేరిలింగంపల్లి మియాపూర్ విజయభారతి న్యూస్ ;
భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగలక్ష్మి కి 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి గొడవలు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లితండ్రులు భర్తపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
