అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే మా లక్ష్యం బాన్సువాడ శాసనసభ్యులు పోచారం.శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ నియోజకవర్గం విజయ భారతి జనవరి 23.పరిధిలో బాన్సువాడ పట్టణంలో 13వ, 15వ వార్డులలో వార్డుసభ మరియు పోతంగల్ మండల పరిధిలో హెగ్డోల్లి,కోటగిరి మండల పరిధిలో అడ్కాస్ పల్లి,బస్వాపూర్ గ్రామాల్లో గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు,
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ సభలు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా,రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలను ఈనెల 26వ తేదీ నుంచి అందించడానికే ఈ గ్రామసభలు నిర్వహిస్తున్న మని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం వాటిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభ ద్వారా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని.ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోయిన నిరాశ పడవద్దని ఇది నిరంతర ప్రక్రియ దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు లబ్ది జరిగేలా చర్యలు చేపడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతు మరియు బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికారులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
