హైదరాబాద్ విజయభారతి న్యూస్ ; తెలంగాణ సచివాలయములో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సాంప్రదాయ మత్యకార గంగపుత్రులు కేవలం చేపల వేటే కుల వృత్తిగా జీవనం సాగిస్తూ పేదరికంలో ఉన్న వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుటకు ఐదు లక్షల ప్రభుత్వ ఆర్థిక సహాయము అందించగలరని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గంగపుత్ర ద్వార మంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా సానుకూలంగా స్పందిచిన సందర్బంగా తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గంగపుత్రకు మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ పాలకమండలి తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
