18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి యువకులు ఓటు హక్కు వినియోగించుకుంటూ ఓటు వేయడమే కాక ఎదుటి వ్యక్తికి దాని విలువ తెలియపరచి ఓటు వేయించాలని సంకల్పం భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే మన ఓటు కీలకం ఓటు అనే ఆయుధం రాజ్యాలను కూలుస్తుంది. ప్రభుత్వాలను కూలదోస్తుంది. మధ్యతరగతి ప్రజలకు అది ఒక ఆయుధం
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలోని శనివారం 15 వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని తహసిల్దార్ మొహమ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో కృషి స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఓటర్ దినోత్సవ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ మన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించి భవిష్యత్తు తరాల కోసం మనం వేసే ఓటు కీలకమని పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి మహేష్, ఎం,పీ,డీ,వో గంగుల సంతోష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డి,టి అశ్విన్, ఏ,ఎస్,ఐ అబ్దుల్ సత్తార్, సంబంధిత శాఖల అధికారులు,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
