తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.
ఆందోల్ జోగిపేట్ నియోజకవర్గం (విజయ భారతి) జూన్ 02. జోగిపేట పట్టణము లో పబ్బతి హనుమాన్ మందిరం ఆవరణలో బిజెపి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఆరు, ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మరియు మాజీ కౌన్సిలర్ పులుగు గోపాల్ మాట్లాడుతూ, ఆత్మ గౌరవ ఉద్యమమే ఊపిరిగా, 60 ఏళ్ల కల సహకారం కావడం లో అసువులు బాసిన అమరులను సమరిస్తూ, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారి వంటి ఎందరో మహానీయుల యోగ దానంతో స్వరాష్ట్రమై పులకరించిన పుడమి తల్లి తెలంగాణ, మహనీయుల ఆశయాలతో ఆశయ సిద్ధికై అమరవీరుల ఆత్మార్పణ ఫలితంగా అవతరించిన నేల తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, 60 ఏళ్ల ఆరాటం ప్రజల అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటం ఈ తెలంగాణ అమరవీరుల పోరాట ఫలితంగా ఎందరో విద్యార్థుల ఆత్మబలిదానంతో మహనీయుల ఆశయాలతో ఆశయ సిద్దికై అమరవీరుల ఆత్మను ఫలితంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం అని వారు పత్రిక పట్టణంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్, ప్రభాకర్ గౌడ్, వెంకటేశం ఎక్స్ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు, పులుగు గోపాల్, గాజుల అనిల్, రవీందర్ గౌడ్, గాజుల నవీన్, ఆంజనేయులు యాదవ్, ఉలువల నర్సింలు, కడాల రాములు, రజనీకాంత్, తుపాకుల రాములు, నాగేష్, పొట్టి రమేష్, గడ్డమీది రాజు, ఎర్రారం సతీష్, కట్ట రవి, అయ్యప్ప శీను, శివ, నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.