“మత్తు వీడండి డ్రగ్స్ కి నో చెప్పండి”… అక్కన్నపేట ఎస్సై విజయభాస్కర్ మరమ్మత్తుల కోసం లక్ష రూపాయలు ఇచ్చిన గుండబోయిన శ్రీనుకు ప్రత్యేక కృతజ్ఞతలు.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్ విజయభారతి న్యూస్.. జూన్ 25 2025.. అక్కన్నపేట… సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ ఆదేశానుసారం డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సును అక్కన్నపేట మండలం మోత్కుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అక్కన్నపేట ఎస్సై విజయ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై విజయభాస్కర్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన అనేది సమాజ శ్రేయస్సుకు మంచి అంశం అని డ్రగ్స్ అనేది ఒక మనిషి ఆరోగ్యాన్ని కాకుండా కుటుంబాలను సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాల రవాణా నిల్వ ఉత్పత్తి చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన దీర్ఘకాలిక ప్రక్రియని, దీనికోసం ప్రభుత్వాలు ప్రజలు సంస్థలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే డ్రగ్సర్హిత సమాజాన్ని నిర్వహించవచ్చని అన్నారు. అనంతరం పాఠశాలలోని మరమ్మత్తుల కోసం తన వంతు సహాయంగా లక్ష రూపాయలు ఇచ్చినటువంటి గుండుబోయిన శ్రీనివాసుని అభినందించారు అదేవిధంగా పాఠశాలలోని మంచినీటి సదుపాయార్థం కోసం తన వంతు సహాయంగా వాటర్ ప్యూరిఫైయర్ ను ఇస్తానని మాజీ ఉపసర్పంచ్ వేల్పుగొండ రవీందర్, అదే అదేవిధంగా పిల్లల భోజన సౌకర్యం కోసం పిల్లలకు ప్లేట్లను అందిస్తానని హెడ్ కానిస్టేబుల్ మొగిలి నాయక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట్ ఎంఈఓ రంగ నాయక్ మోత్కులపల్లి కార్యదర్శి రవీందర్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుల ,ఉపాధ్యాయులు మాజీ సర్పంచ్ ,మాజీ ఉపసర్పంచ్, మాజీ ఎంపిటిసి యువత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
