బీడీ స్కాలర్షిప్ దరఖాస్తుల ఆహ్వానం…
బీడీ కార్మికుల పిల్లల స్కాలర్షిప్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగలరు.
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో గల బీడీ కార్మికుల పిల్లల ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీడీ కార్మిక ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ ఎస్. శ్రీకాంత్ గురువారం ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ బీడీ కార్మికుల పిల్లలకు అందించే ఫ్రీ మెట్రిక్ బీడీ స్కాలర్షిప్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు పోస్ట్ మెట్రిక్ 11వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉపకార వేతనాల కోసం 2025- 2026 విద్యా సంవత్సరం కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోగలరని అన్నారు ఫ్రీ మెట్రిక్ తేదీ: 31-8-2025 వరకు పోస్టు మెట్రిక్ తేదీ: 31-10-2025 వరకు చివరి గడువు ఉందన్నారు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. స్కాలర్షిప్స్. గౌట్. ఇన్ అనే వెబ్సైట్లో నమోదు వివరాలకు మండల కేంద్రంలోని బీడీ కార్మిక ఆసుపత్రిలో సంప్రదించగలరని హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు:0120-6619540:040-29561297 కు సంప్రదించగలరని అన్నారు.