భూ కబ్జాదారునిపై దుండిగల్ లో కేసు నమోదు
జర్నలిస్ట్ ను అసభ్య పదజాలంతో దూషించడంతో మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి కి ఫిర్యాదు
డిసిపి ఆదేశాలు కోర్టు అనుమతి తో కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు
విజయ భారతి/ కుత్బుల్లాపూర్:
రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దర్జాగా గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేయకపోవడం హాస్యాస్పదం
వర్కింగ్ జర్నలిస్ట్ ను అసభ్య పదజాలంతో దూషించిన సంఘటనలో ఓ బూ కబ్జాదారునిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కోర్టు అనుమతితో కేసు నమోదైయ్యింది,ఈ నెల 25న వివిధ పత్రికల్లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన గెస్ట్ నిర్మాణంపై ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి,ఈ నేపథ్యంలో అదే రోజు ఓ దిన పత్రిక విలేకరిని అసభ్య పదజాలంతో దూషించడంతో ఆడియో వైరల్ అయ్యింది,ఈ సంఘటనతో భగ్గుమన్న తోటి విలేకరులు, జర్నలిస్టు సంఘాల సభ్యులు మంగళవారం మేడ్చెల్ డిసిపి కోటిరెడ్డి ని కలిసి జర్నలిస్టును భూకబ్జాదారుడు తిట్టి, బెదిరింపులకు పాల్పడిన ఆడియోలు వినిపించి వాటి ఆధారంగా ఫిర్యాదు చేశారు.దీంతో స్పందించిన మేడ్చల్ జోన్ డిసిపి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ దుండిగల్ సిఐ సతీష్ కు ఆదేశాలు జారీచేశాడు, ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు మేడ్చల్ కోర్టు అనుమతితో ఈ నెల 26న సెక్షన్ల కింద భూకబ్జారుడు ఆకుల బాబు వర్కింగ్ జర్నలిస్టులను బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు దుండిగల్ సిఐ పి.సతీష్ తెలిపారు,సామాన్యులు 60 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తే హడావుడి చేస్తూ సామాన్యులపై కేసులు నమోదు చేస్తున్న రెవెన్యూ అధికారులు దనబల,అధికార బలంతో బూ కబ్జాదారులు రెచ్చుపోతున్న సదరు బూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి,బౌరంపేట కు చెందిన ఆకుల బాబు సర్వే నంబర్ 166/15 లోని రెండు ఏకరాలా ప్రభుత్వ స్తలాన్ని ఆక్రమించి దర్జాగా అనుభవిస్తున్న ఎందుకు కేసు నమోదు చేయడంలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు, జర్నలిస్టు సంఘాల నాయకులు కోరుతున్నారు.