దూలపల్లి లో పైపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
విజయ భారతి/కుత్బుల్లాపూర్:
అక్రమనిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డి అన్నాడు,కొంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో అనుమతిలేకుండా నిర్మిస్తున్న ఒక షెడ్డు ను,రెండు బేస్మెట్ల ను కొంపల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జేసిబి తో కూల్చివేశారు,ఈ సందర్భంగా కమీషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమనిర్మాణాలు చేపడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు,ఫిర్యాదుల ఆధారంగా అక్రమనిర్మాణాలను కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ అధికారులకు,సిబ్బందికి ఒత్తిళ్లు రావడంతో పైపై కూల్చివేతలు చేపట్టి వెనుతిరగడంతో మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు ప్రారంభ దశలోనే అడ్డుకొని ఉంటే ఏ కూల్చివేతలు ఉండేవి కాదని స్థానికులు అంటున్నారు. స్థానిక మున్సిపల్ సిబ్బంది అండదండలతోనే అక్రమ నిర్మాణాల పరంపర కొంపల్లిలో కొనసాగుతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తూతూ మంత్ర చర్యలు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని అక్రమాలకు తావు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.