డాక్టర్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ,రక్తదాతల సన్మానం, ఆరోగ్య కార్డుల పంపిణీ
విజయ భారతి / కుత్బుల్లాపూర్ :
బహదూర్‌పల్లిలోని ఎస్.వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవాన్ని మంగళవారం డాక్టర్స్ డే పురస్కరించుకోని ఘనంగా నిర్వహించింది.
ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా
పేట్ బసీరాబాద్ సీఐ విజయ వర్ధన్, దుందిగల్ ఎస్సై శ్రీనివాస్ రావు
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్వచ్ఛందంగా రక్తం దానం చేయడం ఎంతో గొప్పతనం, నిజమైన హీరోలు ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు మా పోలీసు శాఖ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని అన్నారు.
ఎస్సై శ్రీనివాస్ రావు మాట్లాడుతూ
ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలని ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు మరిన్ని జరపాలని హాస్పిటల్ నిర్వహించిన రక్తదాన కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం” అని
డాక్టర్స్ డే సందర్భంగా ఎస్ వి హాస్పిటల్ యాజమాన్యం
పేద కుటుంబాలకు హెల్త్ కార్డ్స్ పంచి
ఈ ఫ్యామిలీ హెల్త్ కార్డులు మరెంతోమందికి లాభకరంగా మారుతాయని, నిజంగా ఒక సామాజిక బాధ్యతగా చూడదగ్గ కార్యక్రమమని అన్నారు.