పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ కు ఘన సన్మానం
గజ్వేల్ 06 జూలై 2025 విజయభారతి న్యూస్ :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆషాడ మాసం బోనాల పర్వదినం సందర్భంగా పద్మశాలి యువజన సంఘం సభ్యులకు పద్మశాలి పెద్దలకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు తలకొక్కుల ప్రేమ్ కుమార్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ప్రేమ్ కుమార్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని వారికి అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం సభ్యులు పద్మశాలి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.