అక్రమ నిర్మాణాలకు అడ్డ కుత్బుల్లాపూర్ గడ్డ
విజయ భారతి/కుత్బుల్లాపూర్: జూన్ 6 :కుత్చుల్లాపూర్ నియోజకవర్గం- 25 సర్కిల్ పరిధిలోని మయూరి బార్ వెనకాల భారీ అక్రమ పెద్ద షెడ్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించు కోవడం లేదని స్థానికులు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.జిహెచ్ఎంసి అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టిన అనుమతులు తప్పనిసరి. కానీ, అక్రమార్కులకు మాత్రం నిబంధనలు తుంగలో తొక్కి మున్సిపల్ అధికారుల అండర్దండలతోనే ఎద్దేచ్చగా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాల్లో అధికారులు చెప్పిన మామూళ్లకు అలవాటు పడి వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై
ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ షెడ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు.
భారీ అక్రమ షెడ్ల నిర్మాణాలపై అధికారులను వివరణ కోరగా.. కుత్బుల్లాపూర్ సర్కిల్ 25 మున్సిపాలిటీ పరిధిలోని మయూరి బార్ వెనకాల ఆక్రముగా నిర్మాణాలు
జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి రలేదంటూ విషయం దాటేస్తున్నారు. ఏ మూల చూసినా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించడం, వాటిపై అధికారులు మౌనం చూపించడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఇలానే విచ్చలవిడిగా నిర్మాణాలు కొనసాగిస్తే భావితరాలకు చాలా కష్టమవుతుందని వాపోతున్నారు. ప్రతి ఒక్కరు నిర్మించాల్సిన దానికంటే ఒకటి రెండు ఫ్లోర్లు ఎక్కువ నిర్మించి వాటిని రెంట్లకు ఇచ్చి వచ్చే డబ్బులపైనే మక్కువ చూపెడుతున్నారు. మయూరి బార్ వెనకాల ప్రాంతంలో భారీ షెడ్ల నిర్మానాలు జరుగుతున్నా, సంబంధిత మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం ఏమాత్రం స్పందించకపోవడం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది.ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.