Breaking News

గంజాయి మత్తులో గాడి తప్పుతున్న యువత

*గంజాయి మత్తులో గాడి తప్పుతున్న యువత*

*జగద్గిరిగుట్ట పరిధిలో విచ్చల విడిగా గంజాయి వాడకం*

*నిర్మానుష్య ప్రాంతాలను అద్దాలుగా మార్చుకుంటున్న విద్యార్థులు, యువత*

*పోలీసుల కళ్ళు కప్పి విచ్చలవిడిగా గంజాయి వాడకం*

విజయ భారతి న్యూస్ : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని యువత గంజాయిమత్తుకు బానిసలుగా మారుతు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువకులు, విద్యార్థులు మద్యంతోపాటు గంజాయి ఇతర డ్రగ్స్ లో బానిసలుగా మారుతున్నారు. గత సోమవారం రాత్రి జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లో నలుగురు యువకులు నడుస్తుంటే వారి వెనకనుంచి వస్తున్న వ్యక్తి బైక్ హారన్ మోగించాడని అతని ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇష్టానుసారంగా అతనిపై విచక్షతారీయంగా పిడు గుద్దు తో విరుచుక పడ్డారు అడ్డుగా వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ రెచ్చిపోయారు. గాయపడ్డ అతని ముక్కులోంచి నోటిలోంచి తీవ్రమైన రక్తస్రావమై ముక్కుదూలం పగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మానవత్వం మరచి క్రూర మృగాళ్ల మారి అతన్ని కింద పడవేసి ఇష్టానుసారంగా కాళ్లతో తన్నుతూ రెచ్చిపోయారు. ఇంత జరుగుతున్నా ఆ నలుగురు యువకులను ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు. మద్యం మత్తులో ఎవరిని ఏం చేస్తారో అని చూస్తూ ఉండిపోయారు తప్ప యువకులను ఎవరు కట్టడి చేయలేకపోయారు. ఇప్పటికే సోషల్ మీడియా ఊబిలో పడి చిత్తవుతున్న యువత తాము నిర్దేశించుకున్న లక్ష్యం వైపు సాగకుండా తల్లిదండ్రులు తమపై తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ యువకులు, విద్యార్థులు తప్పటి అడుగులు వేస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయిని సేవించడం సరదాగా అలవాటు చేసుకుని మత్తులో కూరుకు పోతున్నారు. గంజాయి మత్తుకు క్రమక్రమంగా అలవాటు పడిన విద్యార్థులు, యువకులు గంజాయి కి బానిసలుగా మారి మత్తుకు అలవాటు బయటపడలేక కొందరు ఏజెంట్లుగా మారుతున్నారు. గంజాయికి డబ్బులు లేక దొంగతనాలు ఇతర నేరాలకు సైతం పాల్పడుతూ తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా ఇస్తాను సారంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు పెద్ద ఎత్తున కమిషన్లు రావడం ఉచితంగా గంజాయి లభించడంతో స్మగర్లుగా మారుతున్నారు. మద్యం మత్తులో ఇప్పటికే మునిగి తేలుతున్న యువత గంజాయి, కొకైన్ తదితర మత్తు పదార్ధాలను వినియోగిస్తూ మత్తుకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తుంది. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండడంతో యువతలో వినియోగం పెరిగిపోయింది.

*నిర్మానుష్య ప్రదేశాలే అడ్డాలు*

నిర్మానుష్య ప్రదేశాలు, ప్రభుత్వ పాఠశాలలని అడ్డాగా చేసుకుని గంజాయిని సిగరెట్ లలో వినియోగిస్తున్నారు. జగద్గిరిగుట్ట పరిధిలో పలు కాలనీలలో గంజాయి పాకెట్లుగా చేసి 250 నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మద్యం సేవించి గంజాయి ఆకుసు సిగరెట్ లలో నింపుకుని తాగడంతో పాటు హుక్కా ద్వారా కూడా వినియోగిస్తున్నారు. గతంలో కైసర్ నగర్ లో గంజాయితో పాటు డ్రగ్స్ కూడా బయటపడింది. డబ్బున్న యువకులు, విద్యార్థులు గంజాయి, కొకెయిన్ తదితర ముత్తు పదార్థాలను వినియోగిస్తుంటే, మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం అట్రోజోలాం, క్లోరల్ హైడ్రేట్, వైటనర్ లిక్విడ్, దగ్గు మందులను మత్తునిచ్చే ఇతర ఇంజక్షన్లను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *