తిరుపతిలో మినిస్టర్ వైట్ 48వ స్టోర్, ఓట్టో 82వ స్టోర్ ప్రారంభం..
విచ్చేసిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ పోతిరాజ్..
అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి..
తిరుపతి(విజయభారతి)
జూలై 16:
చెన్నైకి చెందిన ప్రముఖ భారతీయ బ్రాండ్ మినిస్టర్ వైట్, భారతదేశంలో ధోతీలను ధరించే సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూతన 48వ ఎక్స్‌క్లూసివ్ బ్రాండ్ ఔట్‌లెట్ (ఈబీఓ)ను బుధవారం ఉదయం తిరుపతి గాంధీ రోడ్డులో ప్రారంభించిందిదీంతో నగరంలో ఈ స్టోర్ల సంఖ్య రెండుకు చేరింది. అదేవిధంగా, నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో ఇదే సంస్థకు చెందిన ఓట్టో మెన్స్ వేర్ స్టోర్ ను బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ పోతిరాజ్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం మినిస్టర్ వైట్ బ్రాండ్ దేశవ్యాప్తంగా 5,000కి పైగా మల్టీ-బ్రాండ్ ఔట్‌లెట్‌ల (ఎంబీఓలు) ద్వారా రిటైల్ విక్రయాలు చేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 100 ఈబీఓలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా మినిస్టర్ వైట్ బ్రాండ్‌కు చెందిన ఒట్టో క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పోతిరాజ్ మాట్లాడుతూ, రెండేళ్లుగా ఎయిర్ బైపాస్ రోడ్డులోని తమ మొదటి స్టోర్ ద్వారా తిరుపతిలో ఎంతో ఆదరణ లభించిందన్నారు. ఆ ప్రోత్సాహంతోనే గాంధీ రోడ్డులో రెండో స్టోర్‌ను ప్రారంభించామని తెలిపారు. తమకు అండగా నిలిచిన వినియోగదారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
మినిస్టర్ వైట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ సురేష్ రామసుబ్రమణియం మాట్లాడుతూ సంప్రదాయ దుస్తుల రంగంలో వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ట్రెండీ మరియు ఫ్యాషనబుల్ శ్రేణిని అందిస్తున్నామని చెప్పారు. అన్ని వయసుల వారికి, వివిధ సందర్భాలకు సరిపోయే షర్ట్‌లు, ధోతీల కాంబో-ప్యాక్‌లు, క్యాజువల్ మరియు పండుగలకు సరిపోయే కుర్తాలు, ఫాబ్రిక్ మెటీరియల్స్ ను అందిస్తోందన్నారు. వెస్ట్‌లు, బ్రీఫ్‌లు, పిల్లల దుస్తులను కూడా అందిస్తోందని చెప్పారు. తమిళనాడు మరియు పుదుచ్చేరిలో 32 స్టోర్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో 6, తెలంగాణ మరియు కర్ణాటకలో 4 కేరళలో ఒక స్టోర్ ఉన్నాయని వివరించారు. ఈ బ్రాండ్ ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోందని, యూఎస్ఏ, యూకే, మిడిల్ ఈస్ట్ మరియు ఆగ్నేయాసియాలోని భారతీయ జనాభా ఉన్న అంతర్జాతీయ మార్కెట్‌లలో విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
ఓట్టో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీమతి వర్ష పోతి శివశంకరన్ మాట్లాడుతూ ఓట్టో బ్రాండ్ స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన పురుషుల దుస్తుల శ్రేణితో లక్షలాది వినియోగదారులను ఆకర్షిస్తోందన్నారు. దశాబ్ద కాలంగా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నట్టు తెలిపారు.