శేరిలింగంపల్లి హఫీజ్ పేట్ విజయ భారతి న్యూస్ ;
తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మరియు శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఇమామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో వెంకట్ నారాయణ మరియు వారి అనుచరులు టీజేఎస్ పార్టీలో చేరారు. వెంకట్ నారాయణ గతంలో వైఎస్ఆర్సిపి శేర్లింగంపల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షునిగా కొనసాగాడు. ఈ సందర్భంగా ఇమామ్ హుస్సేన్ మాట్లాడుతూ, టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో , శేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీజేఎస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి టీజేఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి మరియు విశాల్ యాదవ్ , శ్రీనివాస్, శ్రీను, కోటయ్య , వీరయ్య , మధు , నాగరాజు , భగవాన్ , ప్రవీణ్ , రాజు , శంకర్ , కేశవ్ , రాంబాబు , గణేష్ తదితరులు పాల్గొన్నారు.
