Breaking News

అక్రమ నిర్మాణాలను కేరాఫ్ అడ్రస్ శేరిలింగంపల్లి సర్కిల్

*అక్రమ నిర్మాణాలను కేరాఫ్ అడ్రస్ శేరిలింగంపల్లి సర్కిల్*

*శేరిలింగంపల్లి సర్కిల్ 20లో చైన్ మెన్ హవా*

*చైన్ మెన్ మల్లేష్ అండ దండలతో అక్రమ నిర్మాణాల దందా*

*అడిగింది ఇచ్చుకో నచ్చింది చేసుకో*

*చైన్ మెన్ నుండి కమిషనర్ వరకు అందరిపై ఆరోపణలు*

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; శేరిలింగంపల్లి సర్కిల్ 20 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం నిద్రమత్తులో మునిగిపోతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలకు అజ్యం పోస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ లో అనుమతులకు మించి భారీ అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో ఏ నిర్మాణం చేపట్టిన అనుమతులు తప్పనిసరి. కానీ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా టౌన్ ప్లానింగ్ చైన్ మేన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అండదండలతో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. దీంతో జిహెచ్ఎంసి ఆదాయానికి భారీగా గండి పడుతుంది. అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని మామూళ్లకు అలవాటుపడి వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు జరుపుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు చొరవ తీసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సర్కిల్ పరిధిలో ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్లు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్ లో సుమారు 300 నుండి 400 వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో కొన్నిచోట్ల భవనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు. మరికొన్నింటిలో పనులు కొన సాగుతున్నాయి. గతంలోనే కొన్ని నిర్మాణాలు పూర్తి అవగా ఇంకొన్ని మూడు, నాలుగు నెలల క్రితం పనులు మొదలుపెట్టినవే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరి దగ్గరి బంధువులు, వారి అనుచరులు అన్నీ తామై ఈ అక్రమ నిర్మాణాల తతంగాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారికి జీహెచ్ఎంసీ అధికారులు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ఈ విషయంతో సంబంధం ఉందని, అందువల్లే అధికారులు పట్టించుకోవడం. లేదనే ప్రచారం జరుగుతోంది.

శేరిలింగంపల్లి సర్కిల్ జిహెచ్ఎంసి అధికారుల తీరుమారడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమపని తాము చేస్తున్నామని చెప్పుకునే టీపీఎస్ అధికారులు, కింది స్థాయి సిబ్బంది నూతన నిర్మాణాల వద్ద చేస్తున్న హడావుడిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణం వద్దకు వచ్చి ఏదైనా అడిగితే ఇవ్వాల్సిందే.. లేదంటే తాము చెప్పిన వారిని కలిసే వరకు నిర్మాణం చేపట్టవద్దని హుకుం జారీ చేస్తున్నారట. కాదూ కూడదు అంటే లక్షల్లో ఫైన్ కట్టాలంటూ ఇండికేషన్స్ ఇస్తున్నారట. శేరిలింగంపల్లి సర్కిల్ టీపీఎస్ అధికారులు, సిబ్బంది అక్కమార్కులకు కొమ్ము కాస్తూ నిర్మాణదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

శేరిలింగంపల్లి సర్కిల్-20లో చైన్ మెన్, టౌన్ ప్లానింగ్ టిపిఎస్ ఉద్యోగుల హవా కొనసాగుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో వీళ్లే కింగ్ మేకర్లు. సర్కిల్-20 పరిధిలో ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టినా..ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా..వీరికి అడిగినంత ఇచ్చుకోవాల్సిందే.కాదు, కుదరదు అంటే కొత్తగా ఒక ఇటుకను కూడా పేర్చనియ్యరు. తట్టేడు సిమెంట్ ను కూడా పోయ్యనివ్వరు. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలో శేరిలింగంపల్లి సర్కిల్-20 నిర్మాణ రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ సర్కిల్ పరిధిలో సుమారు 3 నుండి 4 లక్షల వరకు జనాభా ఉంటుంది. ప్రతీ ఏటా కొన్ని వందల భవనాల నిర్మాణాలు జరుగుతుంటాయి. కొండాపూర్ ప్రభు పాద, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి సర్కిల్ పరిధిలోనే ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే లైట్ తీసుకుంటారు. ఒక్కదానికి కూడా ఎలాంటి కనీస అనుమతులు, ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్న ఎవరు అడ్డుకోరు సరికదా దగ్గరుండి మరీ అధికారులే వాటిని పూర్తి స్థాయిలో వారి అధికారాన్ని అడ్డంపెట్టి సంరక్షిస్తుంటారని టాక్. ఇలా మన ఘనత వహించిన జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై సర్వత్ర సొసైటీ మొత్తంలో చర్చనీయాంశం అయ్యింది. సర్కిల్-20 పరిధిలోని భవన నిర్మాణాల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. ప్రతీ సంవత్సరం వందల కొద్ది భారీ భవన నిర్మాణాలు జరుగుతున్నందున కోట్లల్లో సోమ్ము సర్కార్ ఖజనాకు జమ అయ్యే ఛాన్సుంది. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు. సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ప్రతీరోజు అనేక చోట్ల కొత్త భవనాలు, అదనపు బిల్డింగ్స్ నిర్మాణాలు, సెల్లార్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. అయితే ఎక్కడ కొత్త నిర్మాణాలు ప్రారంభమైనా అక్కడ ఈ ఉద్యోగులు గద్దల్లా వాలిపోవడం అలవాటుగా మారిపోయింది. భవన నిర్మాణ యాజమానులు వీరికి అడిగినంత ఇస్తే కానీ, అస్సలు ఊరుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీరో పర్మిషన్ కు ఎంత చెల్లించాలి, అదనపు ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ కు ఎంత ముట్టజెప్పాలి..కొత్త భవనాల నిర్మాణాలకు ఎంత చెల్లించాలి అనే విషయాలపై ఓ ధరను నిర్ణయించేస్తున్నారు. ఒకవేళ వీరు చెప్పినంత ఇవ్వకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సదరు నిర్మాణ యాజమానుల వివరాలను చేరవేసి పనులను నిలిపివేయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫైర్ సెఫ్టీ, సెట్ బ్యాక్, ఇతరత్రా కారణాలు చెప్పి నిర్మాణాలు నిలుపుదల చేయిస్తున్నారు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగులకు పై స్థాయి ఉన్నతాధికారుల నుంచి అండదండలు పుష్కలంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన సపోర్టుతోనే ఈ అవినీతి తిమింగలాలు రెచ్చిపోతున్నట్లు సమాచారం. రోజు వారిగా బిల్డింగ్ నిర్మాణ యాజమానుల దగ్గర వసూల్ చేసుకొచ్చిన అవినీతి సోమ్మును పై అధికారులకు వారి వారి స్థాయిలను బట్టి ఎవరి ముల్లే వారికి అప్పజెబుతున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్…

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *