*అక్రమ షెడ్ల నిర్మాణాలపైన అధికారుల మౌనం*
*పూర్తిగా అవినీతి మయమైన టౌన్ ప్లానింగ్*
*టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి*
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఓ శేరిలింగంపల్లి సర్కిల్ 20 అధికారులు డబ్బుకు దాసోహమై అక్రమ షెడ్ల నిర్మాణాలను సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకనే అధికారులు అక్రమ నిర్మాణాలపై మౌనం వహిస్తున్నారనే సందేహాం కలుగక మానదు. అక్రమ నిర్మాణాలపై అవగాహన కల్గి ఉంటే ఉన్నతాధికారులకు వివరించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సింది పోయి వాటికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లుగా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించడం ఏంటనే సందేహం కలుగుతుంది.
పట్టణ ప్రణాళిక విభాగంలో చైన్ మెన్ నుండి పై స్థాయి అధికారి వరకు జీహెచ్ఎంసీలో మామూళ్లకు అలవాటు పడడం వల్లనే ప్రతి వీధిలో అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి అన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెల అధికారులకు జీతాల కంటే అక్రమ నిర్మాణాలపై వస్తున్న మామూళ్లే లక్షలు దాటి కోట్లలో వెనకస్తున్నారనే విమర్శలు సర్కిల్ చుట్టు చక్కర్లు కొడుతున్నాయి.ఈ లెక్కన అధికారుల అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు మౌనం వహించడంతో కిందిస్థాయి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా అవినీతి రాజ్యమేలుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఫలితం ఉండదని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు అక్రమ నిర్మాణాల పైన టౌన్ ప్లానింగ్ అధికారులు పైన చర్యలు తీసుకోవాలని చెప్పిన ఎలాంటి చర్యలు తీసుకోని దుస్థితి నెలకొందని ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉందని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఉప కమిషనర్ లు స్పందించి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సర్కిళ్ల నీ.. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై అందుకు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే జిహెచ్ఎంసి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
*టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి* : – నిబంధనల ప్రకారం నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి డి డి ల రుపెన డబ్బులు చెలించాల్సి ఉంటుంది కానీ వాటిని తుంగలో తొక్కినట్లు వ్యవహరిస్తూ డి డిలు చెలించకుండా అడ్డ దారిలో అక్రమంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమ నిర్మాణాలను నిరోధించాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు మామూళ్లు పుచ్చుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్యహిస్తున్నారన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి అక్రమ నిర్మాణాలు అంటేనే అధికారులకు బంగారు గుడ్లు పెట్టె బాతుల్లా తయారయ్యాయి.
ఆధారాలతో నిరూపిస్తాం…
శేరిలింగపల్లి సర్కిల్ 20, జీ.హెచ్.ఎం.సీ పరిధిలో చెలరేగుతున్న అక్రమ నిర్మాణదారులు..
ప్రేక్షక పాత్రలో టౌన్ ప్లానింగ్ అధికారులు..
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు..
యథేచ్ఛగా బహుళ అంతస్తులు, అక్రమ షెడ్ల నిర్మాణాలు.. ఏ సి పి, టి పి ఓ, చైన్ మెన్ల లీలలపై ప్రజా శ్రేయస్సు దృశ్య పూర్తి ఆధారాలతో విజయభారతి దినపత్రిక లో మరో కథనం పాఠకులకు బహిర్గతం చేస్తాం.పూర్తిగా అవినీతి మయమైన టౌన్ ప్లానింగ్
టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఓ శేరిలింగంపల్లి సర్కిల్ 20 అధికారులు డబ్బుకు దాసోహమై అక్రమ షెడ్ల నిర్మాణాలను సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకనే అధికారులు అక్రమ నిర్మాణాలపై మౌనం వహిస్తున్నారనే సందేహాం కలుగక మానదు. అక్రమ నిర్మాణాలపై అవగాహన కల్గి ఉంటే ఉన్నతాధికారులకు వివరించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సింది పోయి వాటికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లుగా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించడం ఏంటనే సందేహం కలుగుతుంది.
పట్టణ ప్రణాళిక విభాగంలో చైన్ మెన్ నుండి పై స్థాయి అధికారి వరకు జీహెచ్ఎంసీలో మామూళ్లకు అలవాటు పడడం వల్లనే ప్రతి వీధిలో అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి అన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెల అధికారులకు జీతాల కంటే అక్రమ నిర్మాణాలపై వస్తున్న మామూళ్లే లక్షలు దాటి కోట్లలో వెనకస్తున్నారనే విమర్శలు సర్కిల్ చుట్టు చక్కర్లు కొడుతున్నాయి.ఈ లెక్కన అధికారుల అవినీతి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కిల్ డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు మౌనం వహించడంతో కిందిస్థాయి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా అవినీతి రాజ్యమేలుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఫలితం ఉండదని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు అక్రమ నిర్మాణాల పైన టౌన్ ప్లానింగ్ అధికారులు పైన చర్యలు తీసుకోవాలని చెప్పిన ఎలాంటి చర్యలు తీసుకోని దుస్థితి నెలకొందని ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉందని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఉప కమిషనర్ లు స్పందించి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సర్కిళ్ల నీ.. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై అందుకు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే జిహెచ్ఎంసి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి : – నిబంధనల ప్రకారం నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి డి డి ల రుపెన డబ్బులు చెలించాల్సి ఉంటుంది కానీ వాటిని తుంగలో తొక్కినట్లు వ్యవహరిస్తూ డి డిలు చెలించకుండా అడ్డ దారిలో అక్రమంగా షెడ్లను నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమ నిర్మాణాలను నిరోధించాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు మామూళ్లు పుచ్చుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్యహిస్తున్నారన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి అక్రమ నిర్మాణాలు అంటేనే అధికారులకు బంగారు గుడ్లు పెట్టె బాతుల్లా తయారయ్యాయి.
ఆధారాలతో నిరూపిస్తాం…
శేరిలింగపల్లి సర్కిల్ 20, జీ.హెచ్.ఎం.సీ పరిధిలో చెలరేగుతున్న అక్రమ నిర్మాణదారులు..
ప్రేక్షక పాత్రలో టౌన్ ప్లానింగ్ అధికారులు..
ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు..
యథేచ్ఛగా బహుళ అంతస్తులు, అక్రమ షెడ్ల నిర్మాణాలు.. ఏ సి పి, టి పి ఓ, చైన్ మెన్ల లీలలపై ప్రజా శ్రేయస్సు దృశ్య పూర్తి ఆధారాలతో విజయభారతి దినపత్రిక లో మరో కథనం పాఠకులకు బహిర్గతం చేస్తాం.