Breaking News

నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

*నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు*

*అక్రమ షెడ్ల నిర్మాణాలపై పట్టింపేది*..?

*కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు*

*ఎలాంటి నిర్మాణమైన చక చక కానియేచ్చు*

*ఫిర్యాదులు వస్తే మాత్రం మా దృష్టికి రాలేదు పరిశీలిస్తాం అంటూ చేతులు దులుపుకుంటున్న అధికారులు*

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డి ఎల్ ఎఫ్ లో ప్రశాంత్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా బారి అక్రమ షెడ్డు నిర్మిస్తున్నాడు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కార‌ణంగా అక్రమ నిర్మాణాలు పెచ్చుమీరిపోతున్నాయి. లెక్కకు మించి అక్రమ నిర్మాణాలు ద‌ర్శన‌మిస్తున్నా వాటిని అడ్డుకోవడంలో ఉన్నత అధికారులు పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు. జిహెచ్ఎంసి ప‌లు ప్రధాన ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా నిర్మిత‌మ‌వుతున్నా అధికారులలో మాత్రం చ‌ల‌నం క‌నిపించ‌డం లేదు. ఇదేమంటే స‌మాధానం చెప్పే నాధుడే లేడు.
అక్రమ నిర్మాణాల‌పై చ‌ర్యలు తీసుకునే నాధుడు లేడ‌ని స్థానిక ప్రజ‌లు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. నిర్మాణాలు చేస్తుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు దున్నపోతు మీద వాన కురిసిన చందంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అంతే త‌ప్ప వాటిని అడ్డుకోవ‌డానికి మాత్రం ఎలాంటి చ‌ర్యలు చేప‌ట్టడం లేదు.

కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు. ఎలాంటి నిర్మాణమైన చక చక కానియేచ్చు. ఫిర్యాదులు వస్తే మాత్రం మా దృష్టికి రాలేదు పరిశీలిస్తాం అంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అనే దూరదృష్టితో అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి మమా అనిపిస్తారు. చర్యలు ఏవి..? అని ప్రశ్నిస్తే మాత్రం నోటీసులు ఇచ్చాం, ఇక మా చేతులో ఏమీ లేదు అంటూ తప్పించుకుంటారు. కానీ నిరుపేదలు బలహీనులపై మాత్రం ప్రతాపం చూపించి ముందు వెనుక చూడకుండా కూల్చివేతలు చేయిస్తారు. ఇది శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న నిర్వాహకం.అక్రమ షెడ్ల నిర్మాణాలపై పట్టింపేది..?

కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు

ఎలాంటి నిర్మాణమైన చక చక కానియేచ్చు

ఫిర్యాదులు వస్తే మాత్రం మా దృష్టికి రాలేదు పరిశీలిస్తాం అంటూ చేతులు దులుపుకుంటున్న అధికారులు

ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్…

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డి ఎల్ ఎఫ్ లో ప్రశాంత్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా బారి అక్రమ షెడ్డు నిర్మిస్తున్నాడు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కార‌ణంగా అక్రమ నిర్మాణాలు పెచ్చుమీరిపోతున్నాయి. లెక్కకు మించి అక్రమ నిర్మాణాలు ద‌ర్శన‌మిస్తున్నా వాటిని అడ్డుకోవడంలో ఉన్నత అధికారులు పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు. జిహెచ్ఎంసి ప‌లు ప్రధాన ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా నిర్మిత‌మ‌వుతున్నా అధికారులలో మాత్రం చ‌ల‌నం క‌నిపించ‌డం లేదు. ఇదేమంటే స‌మాధానం చెప్పే నాధుడే లేడు.
అక్రమ నిర్మాణాల‌పై చ‌ర్యలు తీసుకునే నాధుడు లేడ‌ని స్థానిక ప్రజ‌లు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. నిర్మాణాలు చేస్తుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు దున్నపోతు మీద వాన కురిసిన చందంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అంతే త‌ప్ప వాటిని అడ్డుకోవ‌డానికి మాత్రం ఎలాంటి చ‌ర్యలు చేప‌ట్టడం లేదు.

కాసులు ఇస్తే అనుమతులతో పనిలేదు. ఎలాంటి నిర్మాణమైన చక చక కానియేచ్చు. ఫిర్యాదులు వస్తే మాత్రం మా దృష్టికి రాలేదు పరిశీలిస్తాం అంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అనే దూరదృష్టితో అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి మమా అనిపిస్తారు. చర్యలు ఏవి..? అని ప్రశ్నిస్తే మాత్రం నోటీసులు ఇచ్చాం, ఇక మా చేతులో ఏమీ లేదు అంటూ తప్పించుకుంటారు. కానీ నిరుపేదలు బలహీనులపై మాత్రం ప్రతాపం చూపించి ముందు వెనుక చూడకుండా కూల్చివేతలు చేయిస్తారు. ఇది శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న నిర్వాహకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *