బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి…. డివిజన్‌ల వారీగా క్యాంపులు నిర్వహించి ప్రతి ఓటరికి సహాయం అందించాలి….. డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ….

విజయభారతి : నిజామాబాద్ న్యూస్ ; జూలై 11 రిపోర్టర్ సుంకరి : గం గా మోహన్.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

నిజామాబాద్: జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను అర్బన్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కావడంతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి డివిజన్‌కు మెంటర్లను నియమించినట్లు తెలిపారు. డివిజన్‌లలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, పార్టీ నాయకులు ఒకేచోట అందుబాటులో ఉండి ఓటర్లకు దరఖాస్తు ఫారాలు నింపడంలో సహకరించాలని సూచించారు.అలాగే ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయం అందించేందుకు వాలంటీర్లను నియమించాలని, కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లు తమ తమ పరిధిలో సమర్థవంతంగా పనిచేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు, ఎస్‌ఐఆర్ అర్బన్ కోఆర్డినేటర్ ఆకుల లలిత, సీనియర్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్రమ్, అర్బన్ ఈఆర్వో కోఆర్డినేటర్ అబ్దుల్ వహీద్, డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు విజయ్‌పాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.